Actor Krishnasai | శిల్పారామంలో 27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలు.. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న హీరో కృష్ణసాయి
Krishnasai | సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శిల్పారామంలో నిర్వహించిన ‘27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలు (Police Band Display)’ అత్యంత వైభవంగా జరిగాయి.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శిల్పారామంలో నిర్వహించిన ‘27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలు (Police Band Display)’ అత్యంత వైభవంగా జరిగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అత్యుత్తమ పోలీస్ బ్యాండ్ బృందాలు ప్రదర్శించిన సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ‘పోలీస్ కంప్లైంట్’ చిత్ర హీరో, ‘ఎంఎస్కే ప్రమీద శ్రీ ఫిలింస్’ అధినేత, ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్’ ఛైర్మన్ కృష్ణసాయి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సీనియర్ నటి ప్రేమ, ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.
ఈ సందర్భంగా హీరో కృష్ణసాయి మాట్లాడుతూ, దేశ భద్రతతో పాటు అంతర్గత శాంతిభద్రతల పరిరక్షణలో సీఆర్పీఎఫ్ (CRPF) అందిస్తున్న నిస్వార్థ సేవలను కొనియాడారు. పోలీస్ దళాల్లో క్రమశిక్షణ, ఐక్యత, కళాత్మక ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిరంతరం కఠినమైన విధుల్లో నిమగ్నమయ్యే జవాన్లు, తమ సంగీత నైపుణ్యంతో ప్రేక్షకులను అలరించడం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
‘హార్మొనీ ఇన్ సర్వీస్’ (Harmony in Service) నినాదంతో ఎస్బీఐ (SBI) సహకారంతో, రెడ్ ఎఫ్ఎం (RED FM 93.5) రేడియో భాగస్వామ్యంతో జరిగిన ఈ వేడుకకు హైదరాబాద్ నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పోలీస్ బ్యాండ్ బృందాల సమన్వయం, దేశభక్తి గీతాల ప్రదర్శనతో శిల్పారామం ప్రాంగణం సందడిగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో తగ్గిన రద్దీ..హుండీ ఆదాయం రూ.4.55 కోట్లు
రామాంజనేయ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
Cyclone Akvan | అక్వాన్ తుపాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. పూరీ తీరం వెంట ఎర్ర జెండాలు.. Video
Lung Health Problems | చలికాలంలో శ్వాసకోశ సమస్యల పట్ల జాగ్రత్త.. ఇలా చేస్తే ఇబ్బందులు ఉండవు..
KA Paul | రేవంత్ రెడ్డిది అవినీతి పాలన.. కనీసం ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వడం లేదు: కేఏ పాల్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

