Jigris First Single | ఇటీవల విడుదలైన ‘జిగ్రీస్’ టీజర్ యూత్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్‌కు కేవలం 3 రోజుల్లోనే 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే తాజాగా, ‘జిగ్రీస్’ సినిమాలోని మొదటి పాట తిరిగే భూమి(Thirige Bhoomi)ని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విడుదల చేశారు.
పాట విడుదల తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఈ పాట చాలా ఎనర్జీటిక్గా ఉందని. కమ్రాన్ సయ్యద్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారని తెలిపారు. పాటలోని సాహిత్యం కూడా చాలా పాజిటివ్‌గా ఉంది. నేను ‘జిగ్రీస్’ టీజర్‌ను ముందే చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. నేను నా ‘K Ramp’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా టీమ్ నన్ను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడే అవకాశం ఇచ్చారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమా టీమ్ ప్యాషన్‌తో పనిచేశారు. ‘జిగ్రీస్’ ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. జిగ్రీస్ టీమ్‌కు నా బెస్ట్ విషెస్ అని తెలిపారు.
ఈ పాటను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ T-Series ద్వారా విడుదల చేశారు. టీజర్‌తో వచ్చిన పాపులారిటీకి తోడు, ఈ పాట కూడా యువతలో మంచి క్రేజ్ తెచ్చిపెడుతోంది. ‘జిగ్రీస్’ చిత్రంలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా, మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు.
టెక్నికల్ టీమ్
డైరెక్టర్: హరీష్ రెడ్డి ఉప్పుల
సంగీతం: కమ్రాన్ సయ్యద్
డి.ఓ.పి: ఈశ్వర్ ఆదిత్య
ఎడిటింగ్: చాణక్య రెడ్డి తూర్పు
మ్యూజిక్ లేబుల్: టీ సిరీస్
డిజిటల్ మార్కెటింగ్: బిగ్ ఫిష్ మీడియా