సరోగసిపై నటి కస్తూరి కామెంట్లు.. మండిపడుతున్న నయన్ అభిమానులు
Actor kasthuri | నటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కవలలకు తల్లిదండ్రులు అయినట్లు ఈ జంట ప్రకటించారు. దీంతో నయన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సరోసగి పద్ధతిలో ఈ జంట తల్లిదండ్రులైనట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: నటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కవలలకు తల్లిదండ్రులు అయినట్లు ఈ జంట ప్రకటించారు. దీంతో నయన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సరోసగి పద్ధతిలో ఈ జంట తల్లిదండ్రులైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సరోగసిపై నటి కస్తూరి చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
“భారతదేశంలో సరోగసి నిషేధించబడింది. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప, అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడం చట్టరీత్యా నేరం. ఇది జనవరి 2022 నుండి వచ్చిన చట్టం. రానున్న రోజుల్లో దీని గురించి ఎక్కువగా వినబోతున్నాం” అంటూ ట్వీట్ చేశారు.
కస్తూరి ట్వీట్పై నయన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘నీ పని నువ్వు చూసుకో అంటూ’ కామెంట్లు చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్న వారికి కస్తూరి ధీటుగా సమాధానమిచ్చారు. ‘అర్హత గల న్యాయవాదిగా ఈ చట్టంపై విశ్లేషణ చేసే హక్కు నాకు ఉంది. నేను ఎవర్నీ ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టలేదు’ అంటూ బదులిచ్చారు.
సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్ లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
To all those telling me to mind my business,as someone who qualified to be a lawyer, I am certain legal analysis counts . And unlike the issue being discussed, my views are given completely altruistically , non commercially and after more than five years of being eligible.
— Kasturi (@KasthuriShankar) October 9, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

