బెంగళూరు డ్రగ్స్ కేసు నేపథ్యంలో సినీ నటి హేమ సభ్యత్వాన్ని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై హేమ బహిరంగ లేఖను విడుదల చేశారు. డ్రగ్స్ కేసులో తాను నిర్ధోషినని, తిరిగి తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సోమవారం ఈ లేఖను ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేసింది.
‘మీడియాలో నాపై వస్తున్న నిరాధారమైన ఆరోపణల నేపథ్యంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్లో నేను పరీక్షలు చేయించుకున్నా. వాటిలో నేను డ్రగ్స్ తీసుకోలేదని తెలిసింది. త్వరలోనే పోలీసులు చేసిన పరీక్షల్లోనూ అవే ఫలితాలు వస్తాయని నాకు నమ్మకం ఉంది. ఈలోపే నన్ను దోషిగా భావించి ‘మా’ సభ్యత్వం రద్దు చేయడం సరైంది కాదని భావిస్తున్నా. ఈ పరిస్థితుల్లో ‘మా’నాకు అండగా ఉండి..నాపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆశిస్తున్నా’ అని హేమ తన లేఖలో పేర్కొంది.