తెలుగు చిత్రసీమలో కథానాయికగా నటించడంతో పాటు ఐటెంసాంగ్స్ ద్వారా యూత్‌లో క్రేజ్ సంపాదించుకుంది హంసానందిని. గత ఏడాది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన ఆమె తాను ఆ మహమ్మారిని జయించానని పేర్కొంది. తనకిది పునర్జన్మలాంటిదని, ప్రేక్షకులు అందించిన దీవెనలతో వ్యాధి నుంచి కోలుకున్నానని చెప్పింది.
ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ లొకేషన్లో ఉన్నా. కెమెరా ముందు నిల్చుంటే జీవితంలోని ఆనందం ఏమిటో తెలుస్తుంది. ఈ రోజు రాత్రి యూనిట్ సభ్యుల మధ్య పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నా. మీ అందరి ప్రేమాభిమానాల వల్లే తిరిగి కెమెరా ముందుకు రాగలిగాను’ అని హంసానందిని ఆనందం వ్యక్తం చేసింది.