Actor Darshan | కన్నడ హీరో దర్శన్ మేనేజర్ శ్రీధర్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్ పవిత్ర గౌడపై కామెంట్స్ చేసినందుకే రేణుకాస్వామిని దర్శన్ హత్య చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆయన మేనేజర్ సైతం ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని దర్శన్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నారు.
ఆయన ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌తో పాటు వీడియో సందేశాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని.. సూసైడ్ లెటర్‌తో పాటు వీడియోలో శ్రీధర్ పేర్కొన్నారు. ఒంటరితనం వేధించడంతో తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ కాగా.. తాజాగా మేనేజర్ ఆత్మహత్య కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.