Actor Brahmaji | టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన పోస్టులతో అలరిస్తుంటాడు. అయితే సినిమా అవకాశాల పేరిట సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారంటూ తాజాగా బ్రహ్మాజీ ఒక పోస్ట్ పెట్టాడు.
అందరికీ హెచ్చరిక.. ఈ సెల్ నంబర్(78268 63455 ) డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ మేనేజర్ నంబర్లా ఉంటుంది. అతని పేరు నటరాజ్ అన్నాదురై. అతడు తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ మేనేజర్‌నని చెబుతూ యంగ్ అండ్ కొత్త ఆర్టిస్టులకి ఫోన్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నాడు. లోకేశ్ నెక్స్ట్ మూవీలో మీరు ఆడిషన్స్‌కి సెలక్ట్ అయ్యారు. కాస్ట్యూమ్స్ కొనడానికి డబ్బులు పంపండి. ఆడిషన్ పూర్తయ్యాక ఆ డబ్బులు వాపస్ ఇచ్చేస్తాం అంటూ చెబుతున్నాడు. ప్రస్తుతం ఇది సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న కొత్త తరహా మోసం.. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే సత్య అనే మరో వ్యక్తి తాను ప్రముఖ సంస్థ జర్నలిస్ట్‌నని చెబుతూ డబ్బులు గుంజడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి వారి పట్ల బీ కేర్‌ఫుల్ అంటూ పోస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం బ్రహ్మజీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Alert ..
Ph no.. 78268 63455
Name-Natraj Annadurai –
Hi everyone, the above number will pose as @Dir_Lokesh sir manager and tell your profile was selected for his next movie.. nd
exact costumes will be required for they will bring as rent for which you need to pay and then…— Brahmaji (@actorbrahmaji) October 5, 2023