Dhanya Balakrishna | బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బాపు’. దయా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజు, సి.హెచ్. భానుప్రసాద్ రెడ్డి నిర్మాతలు. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకులు నాగ్అశ్విన్, చందూ మొండేటి, బుచ్చిబాబు సానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ట్రైలర్ చాలా బాగుందని, ఈ సినిమాకు అన్నీ గుడ్వైబ్స్ కనిపిస్తున్నాయని నాగ్ అశ్విన్ చెప్పారు. ప్రివ్యూస్కు మంచి స్పందన లభిస్తున్నదని, డార్క్ కామెడీ డ్రామాగా ఆకట్టుకుంటుందని దర్శకుడు దయా పేర్కొన్నారు. తన కెరీర్లో మరచిపోలేని సినిమా ఇదని, బ్రహ్మాజీ..ఆమని వంటి సీనియర్స్‌తో కలిసి నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని ధన్యబాలకృష్ణ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.