Balakrishna | 50ఏండ్ల నట ప్రయాణాన్ని ఇటీవలే పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. వరుస విజయాలతో హ్యాట్రిక్ హీరోగా, హ్యాట్రిక్ పొలిటీషియన్‌గా హవా చాటుతున్నారు. 60ప్లస్‌లోనూ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడపడం బాలయ్యకే సాథ్యం. ప్రస్తుతం ఆయన కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటైర్టెన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ని దీపావళి రోజు ప్రకటించనున్నారు. ఇందులో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్టు సమాచారం.
ఇందులో బాలయ్య మార్క్ డైలాగులు ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా ‘సింహం నక్కలమీదకొస్తే వార్ అవ్వదురా.. హంటింగ్’ అనే డైలాగ్ జనబాహుళ్యంగా బాగా వినిపిస్తున్నది. ఈ సినిమా విజయం సాధిస్తే, ఆ తర్వాత వచ్చే ‘అఖండ 2’ విజయం నల్లేరు మీద నడకే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ సారి డబుల్ హ్యాట్రిక్ పక్కా అనే నమ్మకంతో బాలయ్య అభిమానులున్నారు. ఇదిలావుంటే.. బాలయ్యకు త్వరలో ఓ గొప్ప గౌరవం దక్కబోతున్నదని తెలుస్తున్నది. కళాకారుడిగా, సంఘసేవకుడిగా ఆయన సుదీర్గ ప్రయాణానికి తగిన గౌరవం లభించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.