Action King Arjun Sarja | యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లక్ష్మీ దేవమ్మ (85 ) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలుపుతున్నారు.
మైసూర్లో స్కూల్ టీచర్‌గా పనిచేసిన లక్ష్మీ దేవమ్మకు ఇద్దరు కుమారులు. వీరిలో ఒకరు యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కాగా మరొకరు కన్నడ డైరెక్టర్ కిశోర్ సార్జా. ఇక లక్ష్మీ దేవమ్మకు ఒక కుమార్తె కూడా ఉంది. ఈమెకు ఇద్దరు కుమారులు. వారిలో ఒకరు రెండేండ్ల క్రితం మరణించిన కన్నడ నటుడు చిరంజీవి సార్జా కాగా.. ధృవ సార్జా కన్నడ నాట స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇక అర్జున్ విషయానికొస్తే.. ఇప్పటికే నటుడిగా సత్తా చాటిన అర్జున్.. ఇప్పుడు డైరెక్టర్ అవతారం ఎత్తాడు. కుమార్తె ఐశ్వర్యను టాలీవుడ్‌కు పరియం చేస్తూ ఒక సినిమాను తీస్తున్నాడు.
Viruman Movie | షెడ్యూల్ కంటే ముందే థియేటర్లలో.. సందడి చేయనున్న కార్తి మూవీ