Catherine tresa as Ira In Bibisara Movie | హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. చాలా కాలం తర్వాత ‘118’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గాను ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘బింబిసార’ ఒకటి. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాగా.. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఫాంటసీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లతో ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా చిత్రబృందం మరో అప్డేట్ను ప్రకటించింది.
ఫాంటసి యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా కేథరిన్ ట్రెసా హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈమె ఇంట్రడక్షన్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో కేథరిన్ ఐరా పాత్రలోనటించింది. లెటెస్ట్‌గా విడులైన ఈ వీడియోలో కేథరిన్ ఆభరణాలు ధరిస్తూ అచ్చం దేవకన్యలా మెరిసిపోతుంది. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. సంయుక్తమీనన్, వారినా హుస్సేన్‌లు కీలకపాత్రల్లోనటించారు.
Introducing the lovely @CatherineTresa1 as the beautiful queen 'IRA' – the love of King #Bimbisara ♥
▶️https://t.co/UqKXrcu8V4#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVassishta @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt @saregamasouth pic.twitter.com/y3HgxC8OT2
— NTR Arts (@NTRArtsOfficial) July 22, 2022