బుధవారం 24 ఫిబ్రవరి 2021
Cinema - Jan 28, 2021 , 20:02:21

టీజర్‌కు ముందు ‘ఆచార్య’ ప్రీ టీజర్..స‌రికొత్త‌గా ప్రమోషన్స్

టీజర్‌కు ముందు ‘ఆచార్య’ ప్రీ టీజర్..స‌రికొత్త‌గా ప్రమోషన్స్

ఒక్కసారి బరిలో దిగాలని ఫిక్స్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకునేది లేదంటున్నాడు చిరంజీవి. నిన్నటి వరకు ఆచార్య అప్ డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా చూసారు. కానీ ఇప్పుడు మాత్రం వరసగా అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. జనవరి 29న ఈ చిత్ర టీజర్ విడుదల కానుందని ఇప్పటికే అనౌన్స్ చేసాడు కొరటాల శివ. సాయంత్రం 4 గంటలకు ఆచార్య టీజర్ విడుదల కానుంది. దీనికోసం మెగా ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు. ఇదిలా ఉంటే దానికి ఒక్కరోజు ముందుగానే మరో అప్ డేట్ కూడా ఇచ్చాడు కొరటాల. ఈ సారి టీజర్ కు ముందు విడుదల చేసే ప్రీ టీజర్ తో వచ్చాడు చిరంజీవి. అది కూడా సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. 


ఎలాంటి ముందు అనౌన్స్ మెంట్ లేకుండా ప్రీ టీజర్ విడుదల చేసారు. అంటే మేకింగ్ విజువల్స్ అన్నమాట. ఆచార్య సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దేవాదాయ శాఖ నేపథ్యంలో కథ వస్తుందని వార్తలొచ్చాయి. అలాగే ధర్మస్థలి అనే గుడి చుట్టూనే ఈ కథ తిరుగుతుందని కొరటాల శివ కూడా కన్ఫర్మ్ చేసాడు. మొన్న మోషన్ పోస్టర్ లో ఇదే చూపించాడు. ఇప్పుడు టీజర్ విడుదల సమయంలో కూడా పూర్తిగా ధర్మస్థలి అంటూ ఫోకస్ చేసాడు. అక్కడే ఈ కథ అంతా జరుగుతుందని ఇన్ డైరెక్టుగా చెప్తూనే ఉన్నాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాలపై పోరాడే నాయకుడిగా నటిస్తున్నాడు చిరంజీవి. ఫ్లాష్ బ్యాక్ లో చాలా పవర్ ఫుల్ రోల్ లో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈయన నక్సలైట్ అని తెలుస్తుంది. 

ఈ పాత్రపై చాలా ఫోకస్ చేసాడు కొరటాల శివ. ముందు నుంచి కూడా రామ్ చరణ్ పాత్రనే స్పెషల్ హైలైట్ అని చెప్తున్నాడు దర్శకుడు. ఆ పాత్రకు చరణ్ తప్ప మరొకరు సెట్ కారని.. ఆయన కోసమే ఈ పాత్ర రాసానని చెప్పాడు. అయితే టీజర్ లో మాత్రం రామ్ చరణ్ కనిపించడనే తెలుస్తుంది. కేవలం ఆయన వాయిస్ ఓవర్ మాత్రమే వినిపిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా టీజర్ కు ముందు మేకింగ్ విడుదల చేసి టీజర్ పై అంచనాలు మరింత పెంచేసారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo