With Love Trailer | దర్శకుడి నుంచి హీరోగా మారడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాకపోయినా, ఒక సెన్సేషనల్ డైరెక్టర్ హీరోగా ఎంట్రీ ఇస్తుంటే ఆ అంచనాలే వేరుగా ఉంటాయి. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అభిషన్ జీవింత్, ఇప్పుడు ‘విత్ లవ్’ (With Love) సినిమాతో కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్యూట్ లవ్ స్టోరీలో అభిషన్ జీవింత్ హీరోగా నటిస్తుండగా, మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 06న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా తెలుగు ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథగా కనిపిస్తోంది. ట్రైలర్లో విజువల్స్ మరియు మ్యూజిక్ ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యూత్ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తుండగా, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కావ్య అనిల్, సచిన్ నాచిప్పన్, తేని మురుగన్, శరవణన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.