బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు పొందారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమను ఉన్నత స్థానంలో నిలిపిన వారిలో అమితాబ్ బచ్చన్ ఒకరు. ఆయన వారసుడిగా అభిషేక్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా కెరీర్ సజావుగా సాగడం లేదు. హిట్స్ కన్నా ఫ్లాప్స్ ఎక్కువ ఉండడంతో అభిషేక్‌పై నెటిజన్స్ ట్రోలింగ్ ఎక్కువైంది. తండ్రి వలనే ఈ స్థానంలో ఉన్నావు. అమితాబ్ కొడుకువు కాకపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదంటూ గతంలో నెటిజన్స్ అనేకమార్లు ట్రోల్ చేశారు. దీనిని అభిషేక్ లైట్ తీసుకున్నారు.
తాజాగా ఓ నెటిజన్ అందరికి ఆశ్చర్యం కలిగించేలా ట్వీట్ చేశారు. అభిషేక్.. మీ బిగ్ బుల్ చిత్రం చూశాను. ఇందులో మీ నటన మీ తండ్రి అమితాబ్ బచ్చన్ కన్నా గొప్పగా ఉందని కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన అభిషేక్.. మీ ప్రశంసలకు ధన్యవాదాలు. కాని అతని కన్నా గొప్ప నటులు ఎవరు లేరంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Thank you very much for your compliment sir. But nobody, NOBODY can be better than him. 🙏🏽
— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) May 8, 2021