e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News ఖ‌రీదైన ఫ్లాట్‌ అమ్మేసిన అభిషేక్ బ‌చ్చ‌న్..!

ఖ‌రీదైన ఫ్లాట్‌ అమ్మేసిన అభిషేక్ బ‌చ్చ‌న్..!

బాలీవుడ్ మెగాస్టార్ త‌న‌యుడు, న‌టుడు అభిషేక్ బ‌చ్చ‌న్ తన లగ్జరీ ప్లాట్ ను అమ్మేసినట్లుగా ఇంగ్లిషు మీడియాకు చెందిన ఒక ప్రముఖ బిజినెస్ న్యూస్ మీడియా హౌస్ పబ్లిష్ చేసింది. ముంబయిలోని ఒబెరాయ్ 360 వెస్ట్ లో ఉన్న ఈ లగ్జరీ ప్లాట్ ను 2014లో రూ.41 కోట్ల‌తో కొనుగోలు చేసినట్లు స‌మాచారం అందుతుండ‌గా, ఇప్పుడు రూ.45.75 కోట్లకు అమ్మినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన సేల్ డీడ్ పేపర్ల సమాచారం సదరు వెబ్ సైట్ వద్ద ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ముంబైలోని వర్లి ప్రాంతంలో ఒబెరాయ్ 360 అపార్టుమెంట్‌ పడమరలో ఉన్న 37వ అంతస్తులో 7,527 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్న ఈ ఫ్లాట్ చాలా విశాలంగా ఉంటుంద‌ట‌. అయితే 37 అంతస్తుల ప్రాజెక్టులో షాహిద్ కు.. అక్షయ్ కుమార్ తదితరులకు కూడా ప్లాట్లు ఉన్నాయి. షాహిద్ తన ప్లాట్ కోసం రూ.56 కోట్లు చెల్లిస్తే.. అక్షయ్ రూ.52.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు చెబుతారు.

- Advertisement -

అంతంత ధ‌ర పెట్టి వారు కొనుక్కోగా, అభిషేక్ బ‌చ్చ‌న్ త‌క్కువ ధ‌ర‌కు అమ్మ‌డం ఏంట‌ని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అభిషేక్ చివరిసారిగా ది బిగ్ బుల్‌లో కనిపించాడు. ఇది వివాదాస్పద స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇక నిమ్రత్ కౌర్‌తో దాస్వి, చిత్రాంగద సేన్‌తో బాబ్ బిశ్వాస్ సిమాలు చేయ‌గా, అవి విడుదల కావాల్సి ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement