‘110 స్క్రీన్స్‌లో సినిమా విడుదలైంది. ఇప్పుడు 382 స్క్రీన్లకు వెళ్లింది. యూఎస్‌లో 27 స్క్రీన్లలో విడుదల చేశాం. ప్రస్తుతం 86 స్క్రీన్లు ఆడుతున్నది. మంచి కంటెంట్‌తో సినిమా తీస్తే, మౌత్ టాక్ బావుంటే సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో మా ‘ఆయ్’ సినిమా రుజువు చేసింది. శుక్రవారం నాటికి 11కోట్ల గ్రాస్‌కి పైగా వసూలు చేసింది. ఇప్పటికీ 60,70 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తుంది.
అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. కాబట్టే ఈ విజయం’ అని బన్నీవాసు అన్నారు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా విద్య కొప్పినీడుతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘ఆయ్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సక్సెస్‌మీట్‌లో బన్నీవాసు మాట్లాడారు. చిన్న సినిమాకు పెద్ద విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్‌కి థ్యాంక్సనీ, ఇది థియేటర్లలో మాత్రమే చూడాల్సిన సినిమా అనీ, చూడాల్సిన వాళ్లుంటే త్వరగా చూడండనీ దర్శకుడు చెప్పారు. ఇంకా నార్నే నితిన్‌తోపాటు చిత్ర తారాగణం అంతా మాట్లాడారు. యువ నిర్మాత ఎస్.కె.ఎన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.