బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ నిశ్చితార్థం ఆమె ప్రియుడు నుపూర్ శిఖారేతో ముంబైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమిర్‌ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు, ఐరా తల్లి రీనా దత్తా, ఆమిర్‌ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఐరా ఖాన్, నుపూర్ శిఖారే గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్‌గా నుపూర్ పనిచేస్తున్నారు. వీరు కొద్ది నెలల క్రితం తాము డేటింగ్లో ఉన్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమిర్‌ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కూతురు ఐరా. పెద్దల అంగీకారంతో వీరి నిశ్చితార్థం జరగగా..త్వరలో వివాహ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఆమిర్ ఖాన్ సినిమాల నుంచి ఏడాదిన్నర విరామం తీసుకుంటానని ప్రకటించారు.