Aamir Khan | సినిమా ప్రపంచంలో నటులు, నటీమణులు తమ పాత్రలకు తగ్గట్టుగా శరీరంలో మార్పులు చేసుకోవడం కొత్తేమీ కాదు. కొందరు హీరోలు, హీరోయిన్లు బరువు తగ్గి పాత్రలో ఒదిగిపోతే, మరికొందరు పాత్ర కోసం బరువు పెరిగి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. అయితే ఈ ప్రయోగాలు కొన్నిసార్లు వారి కెరీర్‌పైనా ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు అనుష్క శెట్టి ఒకప్పుడు టాప్ హీరోయిన్గా వరుస హిట్స్ అందుకున్న ఆమె, సైజ్ జీరో సినిమా కోసం ఊహించని స్థాయిలో బరువు పెరిగి తర్వాత తగ్గడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ సమయంలో మంచి అవకాశాలు కూడా కోల్పోయారు కూడా. ఇలాంటి రిస్క్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తీసుకున్నారు. “మిస్టర్ పర్ఫెక్షనిస్ట్” గా పేరున్న ఆయన తాజాగా ఒక భారీ లుక్‌లో కనిపించడంతో అభిమానులు షాక్ అయ్యారు.
ఇటీవల విడుదలైన సితారే జమీన్ పర్ సినిమాలో అమీర్ ఖాన్ చాలా యంగ్‌గా, స్టైలిష్‌గా కనిపించి అలరించారు. అదే సమయంలో రజనీకాంత్ కూలీ సినిమాలో తన స్టైల్‌తో మెప్పించారు. ఇప్పుడేమో అమీర్ ఖాన్ పూర్తిగా భిన్నమైన లుక్ తో కనిపించి షాకిచ్చారు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చిత్రం రాజకుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో అమీర్ ఖాన్ భారతీయ సినీ లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన భారీ బరువు పెరిగినట్టు తెలుస్తుంది.
ఈ బయోపిక్ కోసం అమీర్ ఖాన్ చాలా ప్రాజెక్టులను పక్కన పెట్టారని బాలీవుడ్ టాక్. ముఖ్యంగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్–కమల్ హాసన్ మల్టీస్టారర్ తర్వాత అమీర్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేసినా, ఆ ప్రాజెక్ట్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. తన కెరీర్లో ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేసి, పాత్ర కోసం కష్టపడే అమీర్ ఖాన్ ఈసారి కూడా భారీగా బరువు పెరిగి మరోసారి తన డెడికేషన్‌ను నిరూపిస్తున్నారు. అభిమానులు … ఈసారి కూడా అమీర్ కష్టాలు వృథా కావు, ఖచ్చితంగా సక్సెస్ అందుకోవాలి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.