Aamir Khan | బాలీవుడ్ నటుడు అమీర్ ఖన్ ఎప్పుడు కూడా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారనే విషయం తెలిసిందే. ఆయన నటించడమే కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం సితారే జమీన్ పర్. 2007 సంవత్సరంలో రిలీజై భారీ విజయం అందుకొన్న తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ప్రసన్న తెరకెక్కించారు. ఇందులో జెనీలియా దేశ్ ముఖ్ కీలక పాత్రల్లో నటించింది. హాలీవుడ్లో 2018 సంవత్సరంలో రిలీజైన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ సినిమా ఆధారంగా సితారే జమీన్ పర్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతుంది.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 105.17 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధించింది. నెమ్మదిగా పుంజుకుంటూ భారీ వసూళ్ల దిశగా వెళుతుంది. 4 రోజుల్లో భారత్‌లో 65.80 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లని వసూలు చేయగా, గ్రాస్ కలెక్షన్లు 78.33 కోట్ల రూపాయలు చేసింది. అలానే ఓవర్సీస్లో 26.84 కోట్ల రూపాయలు వసూలు చేసిందని, ఇలా మొత్తంగా వంద కోట్లు దాటేసింది. సినిమాపై కొంత నెగెటివిటీ ఉన్నా కూడా ఈ సినిమా వంద కోట్లు రాబట్టడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇక అమీర్ ఖాన్ నటించిన వంద కోట్లు దాటిన చిత్రాలలో ‘సితారే జమీన్ పర్’ 11వ చిత్రంగా నిలిచింది.
‘సితారే జమీన్ పర్’ కంటే ముందు అమీర్ ఖాన్ 10 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్లబ్లో చేరాయి. ఈ చిత్రాలు చూస్తే.. దంగల్ (1968.03 కోట్ల రూపాయలు), సీక్రెట్ సూపర్‌స్టార్ (875.78 కోట్ల రూపాయలు), పీకే (769.89 కోట్ల రూపాయలు), ధూమ్ 3 (556.74 కోట్ల రూపాయలు), 3 ఇడియట్స్ (400.61 కోట్ల రూపాయలు), థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ (322.07 కోట్ల రూపాయలు), గజినీ (189.19 కోట్ల రూపాయలు), తలాష్ (180.83 కోట్ల రూపాయలు), లాల్ సింగ్ చద్దా (129.64 కోట్ల రూపాయలు), ఫనా (102.84 కోట్ల రూపాయలు) వంటి చిత్రాలున్నాయి.