Aamir Khan | తమిళ అగ్రహీరో విజయ్‌తో ‘వారిసు’ చిత్రాన్ని తెరకెక్కించిన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, త్వరలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. ఈ సారి ఏకంగా ఆయన అమీర్‌ఖాన్‌ని డైరెక్ట్ చేయనున్నారట. రీసెంట్గా అమీర్‌కి కథ కూడా వినిపించినట్టు బీటౌన్ సమాచారం.
సౌతిండియన్ డైరెక్టర్లపై అమీర్‌ఖాన్‌కి మొదట్నుంచీ మంచి గురి. ఇప్పుడంటే సౌతిండియన్ డైరెక్టర్లయిన అట్లీ, సందీప్‌రెడ్డి వంగా లాంటి వారితో బాలీవుడ్ హీరోలు తేలిగ్గా సినిమాలు చేసేస్తున్నారు కానీ.. అసలు ఈ ట్రెండ్ లేని రోజుల్లోనే ఏఆర్ మురుగదాస్‌తో ‘గజనీ’ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు అమీర్‌ఖాన్. తాజాగా పైడిపల్లి వంశీ కథకు కూడా ఆయన పచ్చజెండా ఊపే అవకాశం ఉందని బాలీవుడ్ సమాచారం. దిల్‌రాజు బ్యానర్లో ఈ సినిమా రూపొందనున్నదని తెలుస్తున్నది. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చు.