Laal singh Chaddha Trailer | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. ఈయన నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆమిర్ ఖాన్ గత చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ భారీ అంచనాలతో విడుదలై ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ చిత్ర ఫలితంతో ఆమిర్ తన తదుపరి సినిమాపై పూర్తి శ్రద్ధను పెట్టాడు. దాదాపు నాలుగేళ్ళు సమయం తీసుకుని లాల్ సింగ్ చద్దాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. గతేడాది షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్ర ట్రైలర్‌ను ఆదివారం ఐపీఎల్ ఫైనల్ జరుగుతున్నప్పుడు విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే మానసికంగా ఎదుగుదలేని ఒక వ్యక్తి, తన జీవితంలో సంతోషాన్ని ఎలా వెతుక్కుంటాడు. సిరిగ్గా నడవలేని స్థితి నుంచి పరుగుల పోటీల్లో విజేతగా ఎలా నిలుస్తాడు. అనే అంశాలతో సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది. లాల్ సింగ్ చద్దా జీవితంలోని వివిధ దశలను చూపించే ఎమోషనల్ రైడ్‌గా ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రంలో ఆమిర్‌ఖాన్ ఫ్రెండ్ పాత్రలో నాగచైతన్య నటించాడు. కరీనాకపూర్ హీరోయిన్గా నటించింది. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్, విమాకామ్18 స్టూడీయోస్ బ్యానర్లపై ఆమిర్‌ఖాన్, కిరణ్‌రావు, జ్యోతి దేశ్‌పాండే, అజిత్ అందారే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Experience the extraordinary journey of Laal Singh Chaddha, a simple man whose heart is filled with love, hope and warmth. 🙂#LaalSinghChaddhaTrailer out now!
Releasing in cinemas worldwide on 11th Aug.https://t.co/iDS01jchLW#LaalSinghChaddha— Viacom18 Studios (@Viacom18Studios) May 29, 2022