ఇటీవల విడుదలైన రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో అమీర్‌ఖాన్ అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ వర్కింగ్ ైస్టెల్, క్రియేటివ్ విజన్ చూసి అమీర్‌ఖాన్ బాగా ఇంప్రెస్ అయ్యారు. దాంతో ఆయన లోకేష్ కనకరాజ్‌తో ఓ సూపర్‌హీరో మూవీకి సన్నాహాలు చేస్తున్నారని, కథ కూడా కుదిరిందని వార్తలొచ్చాయి. ‘సితారే జమీన్ పర్’ ప్రమోషన్ సమయంలో లోకేష్‌తో తాను సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో సినిమా చేయబోతున్నానని అమీర్‌ఖాన్ ప్రకటించారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ రద్దయినట్లు తెలిసింది.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ బౌండ్స్క్రిప్ట్ సిద్ధం చేయకపోవడమే ఈ సినిమా క్యాన్సిల్‌కు కారణమని చెబుతున్నారు. రఫ్ డ్రాఫ్ట్‌తో షూటింగ్‌కు వెళదామని, చిత్రీకరణ జరుగుతున్న కొద్దీ స్క్రిప్ట్‌కు మెరుగులుదిద్దుదామని లోకేష్ కనకరాజ్ ప్రతిపాదన తెచ్చారట. అయితే బౌండ్స్క్రిప్ట్ లేనిదే తాను సెట్స్‌లో అడుగుపెట్టనని, అది తన ప్రొఫెషనల్ రూల్ అని అమీర్‌ఖాన్ తేల్చిచెప్పారట. దీంతో ఇద్దరూ స్నేహపూర్వక వాతావరణంలోనే ప్రాజెక్ట్ రద్దు వైపు మొగ్గుచూపారని, భవిష్యత్తులో కలిసి పనిచేద్దామనే హామీతో చర్చలు ముగించారని బాలీవుడ్లో కథనాలొస్తున్నాయి.