Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే దంగల్ తర్వాత ఈ స్టార్ హీరో ఖాతాలో చెప్పుకునేంత హిట్స్ ఏమీ లేవని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గతేడాది లాల్ సింగ్ చడ్డా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అమీర్‌ఖాన్ ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్నాడు. లాల్ సింగ్ చడ్డా 2022 ఆగస్టులో విడుదలైంది. అనంతరం కాజోల్ నటించిన సలామ్ వెంకీలో అతిథి పాత్రలో మెరిశాడు.
ఆ తర్వాత అమీర్ ఖాన్ కొత్త సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఫ్యామిలీతో గడిపేందుకు బ్రేక్ తీసుకుంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అమీర్ ఖాన్. చాలా కాలానికి మళ్లీ కొత్త సినిమా అప్డేట్ అందించి మూవీ లవర్స్, అభిమానులను ఖుషీ చేస్తున్నాడు అమీర్‌ఖాన్. సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ మెరిసేందుకు రెడీ అవుతున్నాడు. కొత్త సినిమాను హోంబ్యానర్ అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ (Aamir Khan Productions)లో తెరకెక్కించనున్నాడు. అంతేకాదు ఈ చిత్రం 2024 జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. అమీర్ ఖాన్ నటించిన దంగల్, పీకే, 3 ఇడియట్స్, గజిని క్రిస్మస్ సీజన్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి క్రిస్మస్ సీజన్‌పై కన్నేసి ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నట్టు తాజా అప్డేట్తో అర్థమవుతోంది. ప్రొడక్షన్ నంబర్ 16గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలపై క్లారిటీ రానుందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
తరణ్ ఆదర్శ్ ట్వీట్..
#Xclusiv… AAMIR KHAN LOCKS CHRISTMAS 2024 FOR NEXT FILM… Aamir Khan Productions’ Prod No. 16 [not titled yet],
starring #AamirKhan in the lead role, to release on 20 Dec 2024 #Christmas2024.Pre-production of the film is ongoing and the film goes on floors on 20 Jan 2024…… pic.twitter.com/wAMIvPL60D
— taran adarsh (@taran_adarsh) August 29, 2023