దేశం గర్వించదగ్గ గాయకుడిగా కిశోర్‌కుమార్ తెలియని వాళ్లు ఉండరు. ఆయన గొప్ప నటుడు కూడా. ఆయన స్వర్గస్తుడై 38ఏండ్లయినా నేటికీ ఆయన పాటలు శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి. త్వరలో బాలీవుడ్ తెరపై ఆయన బయోపిక్ రానుంది. అనురాగ్ బసు ఈ చిత్రానికి దర్శకుడు. కిశోర్‌కుమార్‌గా ఆమిర్‌ఖాన్ నటించనున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. దీని గురించి దర్శకుడు అనురాగ్ బసు ఇటీవల మాట్లాడారు.
‘కిశోర్‌కుమార్ బయోపిక్‌ను ముందు రణ్‌బీర్‌కపూర్‌తో చేద్దామనుకున్నాను. అయితే.. అదే టైమ్‌లో ఆయనకు ‘రామాయణ’ ఆఫర్ వచ్చింది. రెండూ గొప్ప సినిమాలే. ఫైనల్‌గా రణ్‌బీర్ ‘రామాయణ’ను ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ బయోపిక్‌లో ఆమిర్‌ఖాన్ నటిస్తారా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం చర్చల దశలో ఉంది. అన్నీ ఓకే అయ్యాక, అగ్రిమెంట్ పూర్తయిన తర్వాతనే అధికారికంగా చెప్పగలను.’ అంటూ వివరించారు అనురాగ్ బసు.