దిల్రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్నాడు. శశి కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కార్తీక మురళీధరన్ కథానాయిక. హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘శృంగార..’ అనే పాటను శుక్రవారం విడుదల చేశారు.
కార్తీక్ స్వరపరచిన ఈ పాటను సంజిత్హెగ్డే, మాళవికా శంకర్ ఆలపించారు. ప్రేమికుల మనసులోని అందమైన భావాలను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ‘ఇదొక సంగీత భరిత ప్రేమకథా చిత్రం. హృద్యమైన కథ, కథనాలతో ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన ‘ఉన్నానో లేనో’ అనే గీతానికి మంచి ఆదరణ లభిస్తున్నది’ అని చిత్ర బృందం పేర్కొంది.