Aadvik Ajith Kumar | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కుమార్ (Ajith Kumar) ప్రస్తుతం Vidaamuyarchi షూటింగ్లో బిజీగా ఉన్నాడని తెలిసిందే. కాగా ఈ స్టార్ హీరో ఇంట బంగారు పతకం వచ్చి చేరింది. అదేంటి అనుకుంటున్నారా..? మీరు విన్నది.. చదివింది నిజమే. మరి ఈ పతకం ఎవరికొచ్చిందనే కదా మీ డౌటు. అజిత్ కుమార్ తనయుడు ఆద్విక్ (Aadvik Ajith Kumar) ఇటీవల జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు.
ఇటీవల జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడు ఆద్విక్. రాబోయే కాలంలో ఆద్విక్ చాంపియన్ కావడం పక్కా అని తెగ చర్చించుకుంటున్నారు అభిమానులు. గోల్డ్ మెడల్‌ను మెడలో వేసుకున్న ఆద్విక్ ఫుట్‌బాల్ టీంతో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అజిత్ కుమార్ షూటింగ్లో బిజీగా ఉండటంతో.. అద్విక్ వెంట తల్లి షాలిని ఉంది.
మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష, రెజీనా కసాండ్రా ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇటీవలే Azerbaijan దేశంలో Vidaamuyarchi షూటింగ్ షురూ అయింది. ఈ చిత్రానికి అజిత్ మొత్తం 110 రోజులు కాల్షీట్లు ఇచ్చాడని ఇన్సైడ్ టాక్. ఈ షెడ్యూల్ తర్వాత చెన్నైలో జరుగనున్న షూటింగ్లో పాల్గొననుంది అజిత్ టీం. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2024 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు.
తల్లి షాలినితో ఆద్విక్ అజిత్‌కుమార్..
Aadvik Ajith Kumar1
#AadvikAjithKumar 🔥 pic.twitter.com/i0jWunoYtf
— Ramesh Bala (@rameshlaus) October 17, 2023
#AadvikAjithKumar excelling in Soccer.. 👏 https://t.co/6fdV0kGwyE
— Ramesh Bala (@rameshlaus) October 17, 2023