Aadu Jeevitham | సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా.. అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ రచయిత బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమా రాగా.. సర్వైవల్ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదలై రెండు నెలలు అవుతున్న ఇంకా ఓటీటీలోకి రాలేదు. దీంతో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు.
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా జూలై 19 నుంచి మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. ఇక ఈ సినిమా పూర్తిగా ఎడారిలో తెరకెక్కిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సాధించింది. ఏఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
Pradheekshayum porattavum niranja Najeebinde jeevitha katha. #Aadujeevitham is coming to Netflix on 19th July in Malayalam, Tamil, Telugu, Kannada and Hindi!#AadujeevithamOnNetflix pic.twitter.com/k95Lg4dChH
— Netflix India South (@Netflix_INSouth) July 14, 2024
Also Read..