ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్‌రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానున్నది. దీపావళి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఆది సాయికుమార్ సీరియస్‌గా నిలబడి ఉండగా, ఆయన వెనుక పొగతో నిండిన ఓ ఆకారం. పక్కనే ఓ కుక్కని ఈ పోస్టర్లో చూడొచ్చు. అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ తదితరులు ఇతర పాత్రల్ని పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె.బంగారి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాణం: షైనింగ్ పిక్చర్స్.