ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’. ‘ఏ మిస్టికల్ వరల్డ్’ ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని నైజాంలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది.
భారతీయ పురాణాలు, సైన్స్ కలబోసిన థ్రిల్లర్ చిత్రమిదని, హిమాలయాల్లోని ఓ గ్రామంలో చోటుచేసుకున్న అంతుచిక్కని ఘటనలు, ఈ క్రమంలో జరిగే అనూహ్య పరిణామాల నేపథ్యంలో సినిమా ఆద్యంతం ఉత్కంఠను పంచుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి, రచన-దర్శకత్వం: యుగంధర్ ముని.