SHAMBHALA | హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న యంగ్ యాక్టర్లలో ఒకడు టాలీవుడ్ యాక్టర్ ఆదిసాయికుమార్ (Aadi Saikumar). ఈ క్రేజీ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం శంబాల (SHAMBHALA). ఏ యాడ్ ఇన్ఫినిటీ ఫేం యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శంబాల మూవీని డిసెంబర్ 25న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారని తెలిసిందే.
ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ షేర్ చేశారు మేకర్స్. శంబాల ఓటీటీ పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా దక్కించుకోగా.. తెలుగు శాటిలైట్ రైట్స్‌ను జీ దక్కించుకుంది. ఇప్పటికే ఆది సాయికుమార్ టీం షేర్ చేసిన శంబాల రషెస్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
సూపర్ న్యాచురల్ థ్రిల్స్, ఇలాంటి ప్రపంచాన్ని నిర్మించడం తొలిసారి… స్టన్నింగ్ విజువల్స్, ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్, వీఎఫ్ఎక్స్ పార్ట్‌తో భారీగా స్థాయిలో రాబోతున్నాం.. అంటూ మేకర్స్ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఈ చిత్రంలో అర్చనా అయ్యర్ హీరోయిన్గా నటిస్తుండగా.. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్, అన్నభీమోజు, మహిధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ రాబోతున్న ఈ చిత్రంలో ఆది జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఈ మూవీకి శ్రీమ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు.
#Shambhala’s OTT and satellite rights were sold even before release — OTT rights acquired exclusively by Aha, and the Telugu satellite rights secured by Zee !! Movie Grand Release on 25th December @iamaadisaikumar pic.twitter.com/SwxfZi6K0f
— BA Raju’s Team (@baraju_SuperHit) November 24, 2025
AR Rahman | మతం పేరుతో చంపడం చాలా తప్పు.. ఇస్లాం మతంలోకి వెళ్లడానికి కారణం ఇదే: ఏఆర్ రెహమాన్