‘శంబాలా’ విజయం తర్వాత అలాంటిదే మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు చిత్ర నిర్మాతలు మహీధర్‌రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు. ఈ చిత్రానికి ‘శంబాలా’ చిత్ర దర్శకుడు యుగంధర్ ముని సమర్పకుడు. ఆది సాయికుమార్ కథానాయకుడు. బృందా రవీందర్ దర్శకత్వం వహించనున్నారు.
‘శంబాలా’ తరహా ఫాంటసీ ఎలిమెంట్స్‌తోపాటు ఎమోషన్స్, హారర్ ఎలిమెంట్స్ కూడా ఈ కథలో తోడయ్యాయని, భయం, ఉత్కంఠతో కూడిన అన్ లిమిటెడ్ ఎంటర్టైనర్ ఇదని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్లో ఆది సాయికుమార్ ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కాను న్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాణం: షైనింగ్ పిక్చర్స్.