డబ్బింగ్ చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టారు అలనాటి హీరో, సీనియర్ నటుడు సాయికుమార్ (Sai Kumar). ఆ తర్వాత విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయికుమార్ పోషించిన పోలీసాఫీర్ పాత్రలు ఆల్‌టైమ్ ఫేవరేట్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డబ్బింగ్ స్టైల్‌తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న సాయికుమార్ పుట్టినరోజు (Sai Kumar Birthday) నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితోపాటు ఆయా సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సాయికుమార్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని కుటుంబసభ్యులు సాయికుమార్‌కు బర్త్ డే విషెస్ తెలియజేశారు.
‘హ్యాపీ బర్త్ డే టూ యూ..డియర్ బాబూ..నాన్న’ అంటూ సాయికుమార్‌కు ఓ వైపు సోదరుడు రవిశంకర్ (Ravi Shankar), మరోవైపు కుమారుడు ఆది (Aadi) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. నాకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి దగ్గర నుంచి ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అని వీడియో సందేశంలో తెలిపారు సాయికుమార్.
సుమన్, అమితాబ్ వచ్చన్, రాజశేఖర్, రజినీకాంత్, అర్జున్సార్జా, విజయ్ కాంత్, విష్ణు వర్దన్, సురేశ్ గోపీ, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరోలకు ఆయా భాషల్లో సాయికుమార్ వాయిస్ ఓవర్ అందించారు. సాయికుమార్ సోదరులు రవిశంకర్, అయ్యప్ప శర్మ, కుమారుడు ఆది కూడా యాక్టర్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
HAPPY BIRTHDAY @saikumaractor love u ❤️ pic.twitter.com/oRoOrowWLX
— Aadi Saikumar (@iamaadisaikumar) July 27, 2022
Read Also :Aadi Sai Kumar | ట్విటర్‌లోకి స్వాగతం..యువ హీరో వీడియో ట్రెండింగ్
Read Also : Liger Nizam Rights | ట్రెండింగ్ టాపిక్‌గా లైగర్ నైజాం రైట్స్..ఇంతకీ ఎంతో తెలుసా..?
Read Also : Thank You | థ్యాంక్యూలో ప్రముఖ నటుడి సీన్లు డిలీట్..నిజమెంత..?