ఇటీవలే ‘లైలా’గా ప్రేక్షకులను పలకరించాడు హీరో విశ్వక్సేన్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘ఫంకీ’. ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఆషికా రంగనాథ్ కథానాయిక. ఆ వెంటనే మరో సినిమాక్కూడా సెయిన్ చేసేశాడట విశ్వక్సేన్. సినిమా పేరు ‘జిత్తూ పటేల్’ అని తెలుస్తున్నది. సాగర్‌చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. పేరుకు తగ్గట్టే ఇది పక్కా మాస్ కథ అట. మరి సినిమాకు నిర్మాత ఎవరు? అనేది మాత్రం తెలియాల్సివుంది. మొత్తంగా జయాపజయాలతో ప్రమేయం లేకుండా.. వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు విశ్వక్.