భారతీయ సినిమాలో క్లాసిక్ చిత్రాల రూపకర్తగా, మాస్టర్ స్టోరీ టెల్లర్గా పేరు తెచ్చుకున్నారు అగ్ర దర్శకుడు మణిరత్నం. ‘పొన్నియన్ సెల్వన్’ ఫ్రాంఛైజీతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చారాయన. అయితే గత చిత్రం ‘థగ్‌లైఫ్’ ఫలితం మాత్రం నిరుత్సాహపరచింది. ఈ నేపథ్యంలో మణిరత్నం తాజా సినిమా గురించి తమిళ ఫిల్మ్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ సేతుపతి, సాయిపల్లవితో ఆయన ఓ ప్రేమకథను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని లేటెస్ట్ టాక్. ఇప్పటికే ఈ సినిమాకు విజయ్ సేతుపతి-సాయిపల్లవి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.
జనవరిలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని, ఏప్రిల్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. తొలుత శింబు కథానాయకుడిగా మణిరత్నం ఈ సినిమాకు ప్లాన్ చేశారట. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయారని తెలిసింది.
దర్శకుడిగా మణిరత్నంను తాను ఎంతగానో ఆరాధిస్తానని, ఆయన సినిమాలో నటించడం తన జీవితకాల స్వప్నమని సాయిపల్లవి పలు సందర్భాల్లో చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె తొలిసారి మణిరత్నం సినిమాలో భాగం కాబోతుండటం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.