Barabar Premistha | సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పాపులర్ టీవీ యాక్టర్ ప్రభాకర్ కుమారుడు, రామ్ నగర్ బన్నీఫేం చంద్రహాస్ (ChandraHass) నటిస్తోన్న చిత్రం బరాబర్ ప్రేమిస్తా. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తోంది. కాగా మేకర్స్ ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు.
తెలంగాణలోని రుద్రారం అనే విలేజ్ బ్యాక్ డ్రాప్లో సినిమా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ద్వారా హింట్ ఇచ్చేశారు మేకర్స్. పరస్పరం గొడవలు పడే ఊరిలో ప్రేమ, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగే లవ్‌స్టోరీని చూపించబోతున్నట్టు రషెస్ చెబుతున్నాయి. యాటిట్యూడ్ స్టార్ హై వోల్టేజీ యాక్షన్ రైడ్‌ను ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సీసీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు.
The wait is over 🔥
Attitude Star #ChandraHass’ #BarabarPremistha locks its release date — FEBRUARY 6, 2026
A high-voltage mass action ride is coming your way#KakarlaSatyanarayana Presents#MegnaMukherjee #SampathRudra #GedaChandu #GayatriChinni #AVR #RRDhruvan #CCCreations… pic.twitter.com/JdohShJlJK
— BA Raju’s Team (@baraju_SuperHit) January 21, 2026
Golla Ramavva | తెలంగాణ సాయుధ పోరాట దృశ్యకావ్యం.. ఘనంగా ‘గొల్ల రామవ్వ’ ట్రైలర్ లాంచ్
Sushmita Konidela | బాక్సాఫీస్ వద్ద ‘శంకర వరప్రసాద్’ హవా.. వైరల్ అవుతున్న మెగా యానిమేషన్ వీడియో!
Border 2 | గల్ఫ్ దేశాల్లో ఇండియన్ సినిమాలపై నిషేధం.. అప్పుడు ‘ధురంధర్’ ఇప్పుడు ‘బోర్డర్ 2’