Director Harsha | శివుడి ఆజ్ఞ అనుకుంటున్నా.. ‘భీమా’కు అదే ప్రధానాకర్షణ: దర్శకుడు ఏ.హర్ష
కన్నడ చిత్రసీమలో కమర్షియల్ దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు ఏ.హర్ష. ‘భీమా’ చిత్రం ద్వారా ఆయన తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు. గోపీచంద్ కథానాయకుడిగా కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది.
Director Harsha | కన్నడ చిత్రసీమలో కమర్షియల్ దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు ఏ.హర్ష. ‘భీమా’ చిత్రం ద్వారా ఆయన తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు. గోపీచంద్ కథానాయకుడిగా కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఏ.హర్ష మాట్లాడుతూ ‘కోవిడ్ సమయంలో ఈ కథ తయారు చేశాను. గోపీచంద్‌కు ఈ కథ బాగా నచ్చింది. యాక్షన్, ఎమోషన్స్, సెంటిమెంట్, ఫాంటసీ..ఇలా అన్ని అంశాల కలబోతగా ఉంటుంది. కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్‌ను జత చేయడం ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు.
ట్రైలర్లో అఘోరాలను చూపించడంతో ‘అఖండ’తో పోల్చిచూస్తున్నారని, అయితే రెండు పూర్తి భిన్నమైన కథలని ఆయన తెలిపారు. ‘పరశురామక్షేత్రం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. గోపీచంద్‌ను మునుపెన్నడూ చూడనటువంటి కొత్త పాత్రలో చూస్తారు. పోలీస్ క్యారెక్టర్‌కు సెమీ ఫాంటసీ అంశాలను జోడించడమే ఈ సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని చెప్పారు. ఈ సినిమా ఆరంభం, ముగింపు రెండూ శివుడితో ముడిపడి ఉంటాయని, మహాశివరాత్రి రోజున సినిమా రిలీజ్ కావడం శివుడి ఆజ్ఞగా భావిస్తున్నానని ఏ.హర్ష ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

