అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘రెండేళ్ల కష్టానికి ప్రతిరూపమిది. నాలుగు సినిమాల కష్టం ఒకే సినిమాకు పడిన భావన కలిగింది. అందరికి అభిమానులు ఉంటే నాకు మాత్రం ఆర్మీ ఉంది.. మీ ప్రేమ కంటే నాకు ఏదీ ముఖ్యంకాదు. దేవిశ్రీప్రసాద్‌తో చాలా ఏళ్లుగా ప్రయాణం కొనసాగుతున్నది. నేను స్వతహాగా మ్యూజిక్ లవర్‌ను. ఆయన స్వరపరచిన ప్రతి పాటను ఎంజాయ్‌చేశాను. చాలా మందితో పనిచేస్తాం. కొంతమంది మాత్రమే మనసుకు నచ్చుతారు. అందులో రష్మిక మందన్న ఒకరు. రాబోయే రోజుల్లో కథానాయికగా ఆమె మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ప్రత్యేకగీతంలో నటించడానికి నాయికలకు కొన్ని పరిమితులుంటాయి. కానీ మేము అడిగిన వెంటనే కాదనకుండా ఈ సినిమాలో సమంత నటించింది. మైత్రీ మూవీస్ లేకపోతే ఈ సినిమా నిర్మాణం సాధ్యమయ్యేది కాదు. మా మావయ్యలు ముత్తంశెట్టి బ్రదర్స్‌తో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సుకుమార్‌గారు ఈ వేడుకకు రావడం లేదని తెలియగానే నిరాశపడ్డా. మంచి సినిమా ఇవ్వడానికి చివరి క్షణం వరకు కష్టపడతానని తన మాటగా చెప్పమని నాతో అన్నారు. ‘అఖండ’ విజయం పరిశ్రమకు ఊపునిచ్చింది. చాలా రోజులు తర్వాత ఫస్ట్‌బాల్‌కు సిక్సర్ కొట్టినంత ఉత్సాహాన్ని అందించింది. ఈ సక్సెస్‌ను ‘పుష్ప’ కొనసాగిస్తుంది. సినిమాలు గెలవాలి. శ్యామ్‌సింగరాయ్, ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్, ఆచార్యతో పాటు అన్ని సినిమాలు గొప్పగా ఆడాలి’ అని అన్నారు. రష్మిక మందన్న మాట్లాడుతూ “గీతగోవిందం’ ప్రచార వేడుకకు బన్నీ ముఖ్యఅతిథిగా వచ్చారు. ఆ రోజు ఆయనతో పనిచేయాలని కోరుకున్నా. అది ఈ సినిమాతో నిజమైంది. స్టార్స్‌గా కాకుండా కొత్తగా ఈ సినిమాలో మమ్మల్ని చూస్తారు. సుకుమార్‌గారు ఈ సినిమా ద్వారా భిన్నమైన ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. ఈ సినిమా కోసం అందరం చిత్తూరు యాసను నేర్చుకున్నాం. సెకండ్‌పార్ట్ చేయడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘మా బ్యానర్లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్ ఇది. ప్రెస్టీజియస్ సినిమాను మాకు చేసే అవకాశం ఇచ్చిన హీరో బన్నీ, దర్శకుడు సుకుమార్‌లకు రుణపడి ఉంటాం. ఈ సినిమాలో బన్నీ విశ్వరూపం చూస్తారు’ అని తెలిపారు. విలన్‌గా నటించాలనే తన కోరికను దర్శకుడు సుకుమార్ ఈ సినిమా ద్వారా నెరవేర్చారని, నటుడిగా తనను కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిదని సునీల్ అన్నారు. ఈ కార్యక్రమంలో చెర్రీ, ముత్తంశెట్టి బ్రదర్స్ పాల్గొన్నారు.
‘సుకుమార్ అంటే నాకు చాలా ఇష్టం. ‘పుష్ప’ సినిమా కోసం సుకుమార్ పగలూ రాత్రి తేడా లేకుండాశ్రమిస్తున్నాడు. సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ మధ్యే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ కోసం ముంబయి వెళ్లాను. అక్కడ కూడా ‘పుష్ప’ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు’ అని అన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘పుష్ప’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. రాజమౌళి మాట్లాడుతూ ‘ టీమ్ అంతా ఈ సినిమాను దేశవ్యాప్తంగా బాగా ప్రమోట్ చేయాలి. ఈ సినిమా ఎంతదూరం వెళితే తెలుగు ఇండస్ట్రీకి అంత మంచి జరుగుతుంది. ‘పుష్ప’ టీజర్ చూసినప్పుడు కళ్లు చెదిరిపోయాయి. విజువల్స్ అద్భుతంగా అనిపించాయి. ఈ సినిమా విషయంలో బన్నీ అంకితభావానికి హ్యాట్సాఫ్ చెబుతున్నా. బన్నీ ఇండస్ట్రీకి దొరికిన ఓ గిఫ్ట్. ప్రతి ఒక్కరు అతనిలా కష్టపడితే మంచి ఫలితాల్ని సాధిస్తారు’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ “పుష్ప’ వంటి ఓ అద్భుతమైన యూనివర్స్ క్రియేట్ చేయడం ఒక్క సుకుమార్‌కే సాధ్యమైంది. సుక్కు తొలి చిత్రం నుంచి అదే పాషన్‌తో పనిచేస్తున్నారు. ఈ స్థాయి ఈవెంట్ జరుగుతున్నా… ముంబయిలో సినిమా ఫైనల్ ప్రొడక్ట్ కోసం కష్టపడుతున్నాడు. నేను అల్లు అర్జున్ అభిమానిని. ప్రతి సినిమాకు ఇంతలా పరిణితి కనబరుస్తున్న ఆర్టిస్టు ఇండియాలోనే లేడు. ‘పుష్ప’లో తన పాత్రకు ప్రాణం పోశాడు. ఈ సినిమా కోసం నేను ఆతృతగా ఎదురుచూస్తున్నా. అల్లు అర్జున్ కోసం మంచి సబ్జెక్ట్ సిద్ధం చేయబోతున్నా’ అని చెప్పారు.
నాలుగు సినిమాల కష్టమిది