ఏఎస్ రవికుమార్‌చౌదరి దర్శకత్వంలో ‘ఫ్లాష్‌బ్యాక్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘లేనిది ఎవరికి?’ అనేది ఈ టైటిల్‌కి ఉపశీర్షిక. ఆద్య ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కార్తీక్‌రెడ్డి రాకాసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
న్యూ ఏజ్ కథాంశంతో రూపొందనున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్కి ప్రముఖ టెక్నీషియన్స్ పనిచేయనున్నారని, ఇందులో నటించే నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రభాకరరెడ్డి, సంగీతం: జేబి, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, వరంగల్ శ్రీను, సమర్పణ: ఎఎస్ రిగ్వేద చౌదరి.