80s Stars Reunion | ప్రతి సంవత్సరం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 1980ల స్టార్స్ రీయూనియన్ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. భారతీయ సినీ పరిశ్రమలో 1980వ దశకంలో వెలుగొందిన తారలు అందరూ ఒకే వేదికపై కలవడం విశేషం. ఈ కార్యక్రమం దక్షిణ భారత సినిమా రంగంలోని వివిధ భాషల స్టార్ నటీనటులను ఒకే తాటికి తీసుకొస్తుంది. ఈ ఏడాది జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, సుహాసిని మణిరత్నం, రాధికా శరత్ కుమార్, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, జయసుధ, ఖుష్బూ, రాధ, మీనా, సురేష్, నరేష్, భానుచందర్, రహ్మాన్, సుమలత, నదియ వంటి అనేక మంది ప్రముఖులు హాజరై సందడి చేశారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక థీమ్‌తో ఈ వేడుక జరిగింది. ఆ థీమ్‌కు అనుగుణంగా నటీనటులు స్టైలిష్ గెటప్‌లతో హాజరై, ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. ఈ రీయూనియన్‌కు హాజరైన వారంతా సినీ పరిశ్రమలో తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, తమ కెరీర్‌కు సంబంధించిన మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. షూటింగ్ అనుభవాలు, సహనటులతో గడిపిన మధుర క్షణాలు, అప్పటి సరదా సంఘటనలన్నీ ఒకసారి మళ్లీ ఓ ఫ్లాష్‌బ్యాక్ లా వేదికపై ప్రతిధ్వనించాయి.ఈ సమావేశంకి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు తమ అభిమాన తారల పాత జ్ఞాపకాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు.
ఈ రీయూనియన్‌కి హాజరైన వారు ఒకరితో ఒకరు సినిమాల్లో కలిసి పని చేయకపోయిన, ఈ వేదికపై మాత్రం అందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. అయితే తాజాగా సీనియర్ నటుడు నరేష్ ఈ కార్యక్రమానికి సంబంధించి రెండు వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇవి నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒక్కొక్కరు చిన్న పిల్లల్లా మారి ఎంత సరదాగా ఎంజాయ్ చేశారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది తెలుగు నుంచి నాగార్జున, బాలకృష్ణ, తమిళం నుంచి కమల్ హాసన్, రజినీకాంత్, మలయాళం నుంచి మమ్ముట్టి వంటి అగ్ర తారలు రీయూనియన్‌కి దూరంగా ఉన్నారు.
All about 80’s Reunion ❤️ pic.twitter.com/U0yUq9NbAP
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) October 7, 2025
Shubodayam 🥰
Finally the video of the memorable 12th reunion of the class of 80s😍😃#80sStarsReunion pic.twitter.com/gaRIxMKbwo— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) October 7, 2025