కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 777 చార్లి (777 Charlie). కే కిరణ్ రాజ్ దర్శకత్వం వహించాడు. 777 చార్లి (పెట్) ధర్మ అనే వ్యక్తి జీవితంలోకి ప్రవేశించి..అతడి జీవితాన్నిఎలా ప్రభావితం చేసిందనే కథాంశంతో తెరకెక్కింది. జూన్ 10న విడుదలైన 777 చార్లి బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బావోద్వేగపూరితమైన సన్నివేశాలతో సాగే ఈ చిత్రం యానిమల్ లవర్స్ ను ఫిదా చేసింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ ప్లాట్ ఫాంపై వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం Voot Select ఓటీటీ ప్లాట్ ఫాంలో కన్నడ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది 777 చార్లి. కన్నడ వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది.
ఫీల్ గుడ్ లైఫ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంని పరంవాహ్ స్టూడియోస్ బ్యానర్‌పై జీఎస్ గుప్తా, రక్షిత్ శెట్టి సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. తెలుగులో ఈ చిత్రాన్ని రానా సమర్పించాడు.