ఆర్ఎక్స్ 100 (RX 100) సినిమాతో టాలీవుడ్‌కు అదిరిపోయే హిట్టు అందించాడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఈ సినిమా బాక్సాపీస్ వద్ద మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచి..నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత శర్వానంద్, సిద్దార్థ్‌తో కలిసి తెరకెక్కించిన మహాసముద్రం ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేకపోయింది.
ఈ టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలోనే బాలీవుడ్ (Bollywood) ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన రెండు సినిమాలతో ఇంప్రెస్ అయ్యాడట బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ( Rajkumar Hirani). ఈ స్టార్ డైరెక్టర్ అజయ్ భూపతిని బాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది.
తాను రాసిన కథను డైరెక్ట్ చేయాలని అజయ్‌తో హిరానీ ఇప్పటికే చర్చించాడని ఓ వార్త ఇపుడు ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం షారుక్‌ఖాన్‌తో చేస్తున్న డుంకీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరి ఈ స్టార్ డైరెక్టర్ సారథ్యంలో అజయ్ భూపతి బీటౌన్ ఎంట్రీ ఇస్తున్నాడన్న అప్డేట్పై ఏదైనా అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ రానుంది.