71st National Film Awards | 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం (71st National Film Awards) సెప్టెంబర్ 23, 2025న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గ్రాండ్‌గా జరుగుబోతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై జాతీయ అవార్డుల ప్రకటించిన విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. అయితే ఈ వేడుకకు అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్‌తో పాటు బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ, నటుడు విక్రాంత్ మస్సే అలాగే ఇతర భాషల నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ ఏడాది ‘జవాన్’ సినిమాకు గానూ షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాకు రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాలను అందుకోబోతున్న విషయం తెలిసిందే. షారుఖ్ తన 33 ఏళ్ల కెరీర్లో తొలిసారి ఈ అవార్డును గెలుచుకోబోతుండగా.. ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్, ’12th ఫెయిల్’ సినిమాకు గానూ విక్రాంత్ మాస్సేతో కలిసి ఈ అవార్డును పంచుకుంటున్నారు. అలాగే ఈ వేడుకలో ’12th ఫెయిల్’ చిత్రానికి ఉత్తమ చలనచిత్ర పురస్కారం, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రానికి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం పురస్కారం దక్కనున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు సుదీప్తో సేన్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోనున్నారు. తెలుగు నుంచి బలగం సినిమాకు అవార్డు గెలుచుకున్న సింగర్ కాసర్ల శ్యామ్‌తో పాటు భగవంత్ కేసరి టీమ్, బేబీ టీమ్ సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది.