7/G Brindavan Colony | మళ్లీ థియేటర్లలోకి కల్ట్ సినిమా.. 7/G బృందావన్ కాలనీ రీ-రిలీజ్ డేట్ కన్ఫర్మ్..!
7/G Brindavan Colony | దశాబ్దాల సినీ చరిత్రలో లెక్కలేనన్ని ప్రేమకథల కాన్సెప్ట్‌తో సినిమాలు వచ్చాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో బరువును మిగిల్చాయి.
7/G Brindavan Colony | దశాబ్దాల సినీ చరిత్రలో లెక్కలేనన్ని ప్రేమకథల కాన్సెప్ట్‌తో సినిమాలు వచ్చాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో బరువును మిగిల్చాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకొనేది 7/G బృందావన్ కాలనీ. నిజానికి ఇదొక తమిళ సినిమా. కానీ తెలుగులో కోలీవుడ్ మించి విజయం సాధించింది. సినిమా వచ్చి పంతొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే స్క్రీన్కు అతుక్కుపోతుంటాం. అంతలా చెదరిపోని జ్ఞాపకాలు మిగిల్చింది. ముఖ్యంగా సినిమా రిలీజప్పుడు యూత్‌లో ఈ సినిమా సృష్టించిన యుఫోరియా అంతా ఇంతా కాదు. వారం పాటు థియేటర్లలో టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. అలాంటి కల్ట్ సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తుంది.
సెప్టెంబర్ 22న ఈ సినిమా రీ-రిలీజ్ కాబోతుంది. కాగా దీనిపై తాజాగా ఈ సినిమా హీరోయిన్ సోనియా ఈ సినిమా రీ-రిలీజ్ అవుతుండటంతో ఎగ్జైట్మెంట్కు గురవుతున్నట్లు తెలిపింది. నా ఆల్‌టైమ్ ఫేవరైట్ సినిమాల్లో ఒకటైన కల్ట్ క్లాసిక్ మూవీ 7/G బృందావన్ కాలనీ థియేటర్లలో మళ్లీ వస్తుందని తెలియడంతో చాలా సంతోషించాను. అదే విధంగా థ్రిల్గానూ ఉంది. దాదాపు పంతొనిమిదేళ్ల తర్వాత ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ మళ్లీ సిల్వర్ స్క్రీన్కు రానుంది. ఈ సినిమాతో నాకున్న జ్ఞాపకాలు చెక్కు చెదరనివి. ఈ నెల 22నుంచి సినిమాను సిల్వర్ స్క్రీన్లలో చూడడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులతో సిద్ధంగా ఉండండంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు కూడా తెలుస్తుంది. సెల్వ రాఘవన్ ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో మునిగిపోయాడని చెన్నై టాక్. అయితే సీక్వెల్లో హీరోయిన్ ఎవరా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకుంటే తొలిపార్టులో సొనియా అగర్వాల్ చనిపోతుంది. దాంతో సెకండ్ పార్ట్‌లో హీరోయిన్ ఎవరా అన్నది అందరిలో క్యూరియాసిటీ నెలఉంది. పైగా అనితగా సోనియా చూపిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. నిజానికి ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ ఆమెకే ఇవ్వాలి. ఇక తొలి పార్టుకు తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోసిన యువన్ శంకర్ రాజానే సెకండ్ పార్టుకు కూడా సంగీతం వహించబోతున్నట్లు టాక్.
“I’m absolutely delighted and thrilled to hear that one of my all-time favorites, the cult classic movie #7GBrundavanColony, is making a comeback in theaters! 😍
This magical love story will grace the big screen once again, almost after 19 years ,Every memory associated with… pic.twitter.com/Zw7TZzL2B2
— Sonia aggarwal (@soniya_agg) September 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

