తిరువీర్, ఐశ్వర్యరాజేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఓ..సుకుమారి’ అనే టైటిల్ను నిర్ణయించారు. భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. టైటిల్ ప్రకటన సందర్భంగా బుధవారం విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. సుకుటుంబ కథా చిత్రమిదని, వినోదానికి పెద్దపీట వేస్తూ తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు.
ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ఐశ్వర్యరాజేష్, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా ద్వారా తిరువీర్ మంచి విజయాల్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, అంజిమామ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భరత్ మంచిరాజు, దర్శకత్వం: భరత్ దర్శన్.