Dr Shiva Rajkumar | కన్నడ చక్రవర్తి స్టార్ హీరో శివరాజ్ కుమార్ నేడు తన 63వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే శివన్న బర్త్‌డే కావడంతో ఆయన నటిస్తున్న సినిమాలనుంచి వరుస అప్డేట్లను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి శివన్న ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేయగా.. ఇందులో గౌర్నాయుడు పాత్రలో శివన్న కనిపించబోతున్నాడు. ఇదిలావుంటే ఆయన నటిస్తున్న కన్నడ, తెలుగు బైలింగ్యూవల్ చిత్రం 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్() నుంచి కూడా మేకర్స్ శివరాజ్ కుమార్‌కి బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్లో శివరాజ్‌తో పాటు పుష్ప నటుడు డాలీ ధనుంజయ కూడా కనిపిస్తున్నాడు.
ఈ సినిమాకు సప్త సాగరాలు దాటి సినిమా దర్శకుడు హేమంత్ రావు (Hemanth Rao) దర్శకత్వం వహిస్తుండగా.. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Partners in chaos on a crazy mission where reality is a mere suggestion. Happy birthday to the leader of our operation, the one and only @NimmaShivanna. There is simply no one else like you. #King ♥️🤗 pic.twitter.com/Q0LayyDli5
— Hemanth M Rao (@hemanthrao11) July 12, 2025