‘నివేదా తన నటనతో ఆశ్చర్యపరిచింది. తన భుజాలపై సినిమాను మోసింది. తనతో పనిచేయడం హానర్‌గా భావిస్తున్నా. అలాగే హీరో విశ్వదేవ్ మా సంస్థ నిర్మించిన ‘పిట్టగోడ’ ద్వారానే పరిచయం అయ్యాడు. ‘35’లో తన నటనతో సర్ప్రైజ్ చేశాడు. చాలాకాలం తర్వాత థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని చూశాను.
దర్శకుడు నందు వల్లనే ఇది సాధ్యమైంది. తనలోని స్వచ్ఛత సినిమాలో కనిపించింది. ఇలాంటి మంచి కథల్ని ఎప్పుడూ మీ ముందుకు తెస్తూనే ఉంటాం’ అని రానా అన్నారు. సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లిలతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘35-చిన్నకథ కాదు’.
నివేద థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రధారులుగా నందకిశోర్ ఈమని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన థ్యాంక్స్‌మీట్‌లో రానా మాట్లాడారు.
35 ఆడుతున్న థియేటర్లన్నీ ఫ్యామిలీ ఆడియన్స్‌తో కళకళలాడుతున్నాయని నివేద థామస్ ఆనందం వెలిబుచ్చారు. ఈ సినిమా ప్రయాణం ఇప్పుడే మొదలైందనీ, ప్రేక్షకుల సపోర్ట్ కావాలని దర్శకుడు అన్నారు. ఇంకా నిర్మాతలు, హీరో విశ్వదేవ్ కూడా మాట్లాడారు.