నవీన్చంద్ర, షాలినీ వడ్ని కట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘28 డిగ్రీ సెల్సియస్’. డా॥ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ నిర్మించారు. ఈ నెల 28న విడుదలకానుంది. ఈ సినిమా నుంచి ‘చెలియా చెలియా..’ అనే పాటను శుక్రవారం విడుదల చేశారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్నందించారు. ‘నీ నగుమోము కనులారా చూస్తుంటే క్షణమైనా కనురెప్ప వాలేనా, నా కనుసైగ నీ వెనకా వెంటాడే మౌనంగా, నిన్ను చూడంగ..కనులు చాలవుగా..నా జతగా రా, చెలియా చెలియా’ అంటూ చక్కటి లవ్ఫీల్తో ఈ పాట సాగింది. హృదయాన్ని స్పృశించే ప్రేమకథా చిత్రమిదని, ఇందులో టెంపరేచర్ అనే కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. జయప్రకాష్, ప్రియదర్శి, హర్ష చెముడు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, దర్శకత్వం: డా॥ అనిల్ విశ్వనాథ్.