Tollywood | చూస్తుండగానే ఈ ఏడాదిలో ఐదు నెలలు పూర్తి కావొస్తుంది. కొత్త సంవత్సరంలో చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు విడుదలై ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేయగా, కొన్ని చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. అయితే ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో కొన్ని క్రైమ్ థ్రిల్లర్లు, మరికొన్ని మర్డర్ మిస్టరీలు, ఇంకొన్ని కోర్టు రూమ్ డ్రామాలున్నాయి. మరి వాటిలో ప్రేక్షకులని ఎక్కువగా మెప్పించిన చిత్రాలేంటనేది చూస్తే ముందుగా.. అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ మూవీ కేసరి2 తొలి స్థానంలో ఉంది.. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.129.14 కోట్లు కలెక్ట్ చేసి అదరహో అనిపించింది.
కోర్టు: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనే చిత్రం రెండో స్థానంలో నిలిచింది. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో తక్కువ బడ్జెట్ తో కోర్టు డ్రామాగా ఈ చిత్రం రూపొందించగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.58.15 కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాల్ని మిగిల్చింది.ఇక కోలీవుడ్ నుండి వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమా కూడా మంచి విజయం సాధించింది. కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించే వలస కుటుంబం కథగా ఈ సినిమా రూపొందింది. ఫన్నీ ఫ్యామిలీ డ్రామాగా శశి కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూ.25 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది.
ఇక మలయాళ ఇండస్ట్రీ నుంచి రీసెంట్ గా వచ్చిన తుదరమ్ సినిమా కూడా ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా తెరకెక్కి హిట్ టాక్ దక్కించుకుంది. మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సినిమా రూ.175 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఇక క్రైమ్ సినిమాలను ఇష్టపడే వారు ఎవరైన ఉంటే కన్నడ సినిమా అజ్ఞాతవాసిని తప్పకుండా చూడాల్సిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో సీక్రెట్స్, ఎవరూ ఊహించని ట్విస్టులతో మంచి స్క్రీన్ ప్లే తో మజా అందిస్తుంది. ఇప్పటి వరకు చెప్పుకున్నవి అన్నీ కూడా చిన్న బడ్జెట్‌తో రూపొందిన చిత్రాలే . కాని పెద్ద విజయాలు సాధించాయి.