బుధవారం 08 జూలై 2020
Cinema - May 26, 2020 , 23:50:33

వలస కార్మికులకు సినీనటుడు జగపతిబాబు చేయూత

వలస కార్మికులకు సినీనటుడు జగపతిబాబు చేయూత

లాక్‌డౌన్‌ కారణంగా సొంతూర్లకు వెళ్లకుండా ఉండిపోయిన వలస కార్మికులకు అండగా స్టాప్‌ ది వాక్‌ పేరిట సినీ నటుడు జగపతిబాబు అండగా నిలుస్తున్నాడు. సోమవారం రాత్రి నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని రాయల్‌ఫంక్షన్‌హాల్‌లో ఉన్న వలస కార్మికుల కోసం సినీహీరో జగపతిబాబు రెండు బస్సులను ఏర్పాటు చేసి 75మంది వలస కార్మికులను కలకత్తాకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. కార్మికులకు భోజన ఏర్పాటు చేయడంతో పాటు పండ్లను  అందజేశారు. నార్సింగి ఎస్సై బలరాంనాయక్‌తో కలిసి బస్సు జెండా ఊపి బస్సులను కలకత్తాకు పంపించారు. 


logo