పోకిరితో రికార్డులు బ్రేక్ చేసిన మహేష్.. నేటికి 15 ఏళ్లు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏది అంటే పోకిరి అని ఠక్కున చెప్తారు. ఈ సినిమాతో మహేష్‌లోని మాస్ యాంగిల్‌ని బయటకు తీసిన ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని అందించాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా పంచిన వినోదం అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్ రికార్డులని తిరగరాసిన ఈ చిత్రం 299 సెంటర్స్ లో 50 రోజులు, 200 సెంటర్స్‌లో 100 రోజులు, 63 సెంటర్స్‌లో 175 రోజులు నడిచి ఆల్ టైం రికార్డ్ సాధించింది.
ఏప్రిల్ 28 నాటికి ఈ చిత్రం విడుదల అయ్యి 15 ఏళ్ళు పూర్తి చేసుకోడంతో సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.పోకిరి హ్యాష్ ట్యాగ్‌తో తెగ ట్రెండ్ చేస్తుండడంతో ఇప్పుడు పోకిర హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అప్పట్లోనే 40 కోట్ల షేర్ ను రాబట్టి దక్షిణాదిలోనే ఈ మార్క్ అందుకున్న మొట్ట మొదటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ గా పేరు గాంచిన ఈ సినిమా అత్యధిక భాషల్లో రీమేక్ కాబడిన చిత్రంగా కూడా నిలిచింది. మణిశర్మ మ్యూజిక్, బ్రహ్మీ, అలీ కామెడీ, ఇలియానా గ్లామర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. మళ్లీ మహేష్-పూరి కాంబినేషన్లో పవర్ ఫుల్ మూవీ రావాలని ఆడియాన్స్ కోరుకుంటున్నారు.
ఇవికూడా చదవండి..
ఈశాన్య భారతాన్ని వణించిన భూకంపం
దేశంలో 2 లక్షలు దాటిన కరోనా మరణాలు
దవాఖానలో అగ్నిప్రమాదం.. నలుగురు రోగులు మృతి
కరోనా 617 వేరియంట్లపై కొవాగ్జిన్ ప్రభావవంతం : ఆంథోనీ ఫౌసీ
బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్… అయినా పట్టించుకోరా?
మరణాల్లో పెరుగుదలకు డబుల్ మ్యుటెంట్కు లింక్ లేదు!
రోజువారీ కేసుల్లో 38% ఇండియాలోనే
భారత్‌కు తక్షణ సహాయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
కరోనా వ్యాక్సిన్ పేటెంట్ తీసెయ్యాలి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

